ఇంతియాజ్ కు డాక్టరేట్
ఇంతియాజ్ కు డాక్టరేట్
నెల్లూరు, మేజర్ న్యూస్ : ప్రముఖ పారిశ్రామికవేత్త మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ కు అమెరికా విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ కమిషన్ సహకారంతో సామాజిక సేవలో డాక్టరేట్ ను అందుకున్నారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరులో గత 15 సంవత్సరాలుగా తాను అందించిన అసాధారణ సేవలకు ప్రతిష్టాత్మక ప్రస్కారం ప్రధానం చేసినట్లు పేర్కొన్నారు. ఈ గౌరవాన్ని పుదుచ్చేరి శాసనసభ స్పీకర్ సెల్వం, హోం మంత్రి, విద్య, విద్యుత్తు, వాణిజ్యం, పరిశ్రమల మంత్రి ఏ నమశ్శివాయం, జిల్లా న్యాయమూర్తి, జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుడు ఎస్ మౌట్టు వెల్, అమెరికా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ ప్రోటీమా మధు కృష్ణన్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది అన్నారు. తాను సమాజానికి చేసిన విశేషమైన కృషిని ఈ గౌరవం ప్రతిబింబిస్తుందన్నారు.