పదవ తరగతి  గిరిజన గురుకుల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ





ఎన్ టి ఎఫ్ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేసిన పులి చెంచయ్య


గిరిజన గురుకుల పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు పులి చెంచయ్య ఆధ్వర్యంలో ఉచితంగా పదవ తరగతి స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పరిమళ హాజరయ్యారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ లను అందజేసిస ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. పదో తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడేలా స్టడీ మెటీరియల్ ఉందని దానిని ఉచితంగా విద్యార్థులకు అందిస్తున్న ఎన్ టీ ఎఫ్ నాయకులకు ఆమె అభినందనలు తెలియజేశారు.


నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు పులి చెంచయ్య మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు స్టడీ మెటీరియల్ సద్వినియోగం చేసుకొని నెల్లూరు ఐటీడీఏ కు తల్లిదండ్రులకు , మంచి పేరు తీసుకురావాలని కోరారు. స్టడీ మెటీరియల్ ను జిల్లా లోని అన్ని గిరిజన గురుకుల పాఠశాలకు అందిస్తామని తెలియజేశారు.ఈ మంచి కార్యక్రమానికి సహకారం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ దాసరి పోలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరగిరి దయాకర్, కోశాధికారి యాకసిరి లోక సాయి, యూత్ సెక్రెటరీ పంతంగి శ్రీనివాసులు, సిహెచ్ వెంకటరమణయ్య, హెచ్ ఎం. విజయలక్ష్మి పాల్గొన్నారు