భూ సమస్యలపై 4వ రోజు ఉత్కంఠంగా సాగుతున్న ధర్నా 

 దళిత గిరిజనలు అడ్డగించుకున్న భూములపై  మాఫియా కన్ను 

స్థానికులకు లేని భూమి హక్కు,బయట వారికి వందల ఎకరాలు  ఎలా ఇస్తారు 

దళిత గిరిజనుల భూ సమస్యపై చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం




నెల్లూరు [సైదాపురం], రవికిరణాలు ఏప్రిల్ 23 : 

సైదాపురం మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  నాలుగవ రోజు తాసిల్దార్ కార్యాలయం వద్ద ఉత్కంఠంగా సాగుతున్న ధర్నా  ఊటుకూరు దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి, దళితులు అక్రమణలో గల  ప్రభుత్వ భూములకు యాజమాన్యం హక్కు కల్పించాలని, భూస్వాముల ఆధీనంలో ఉన్న సర్వేనెంబర్ 356, 359 గల 400 ఎకరముల ప్రభుత్వ భూములను ఆక్రమణలు తొలగించి దళితులకు ఇతర పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సైదాపురం మండలం, ఉటుకూరు గ్రామ దళితులు  బుధవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరవదిక ధర్నా నాలుగోవ రోజు నిర్వహించారు . ఆ సందర్బంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి అఖిల భారత రైతుల కూలీ సంఘం  జిల్లా అధ్యక్షుడు డి.పి పోలయ్య మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలో దళితుల పై అక్రమ కేసులు,  పోలీసుల వేదింపులు, భూ ఆక్రమణలు అధికార పార్టీ అండదండలతో ఎదేచ్చగా కొనసాగుతున్న వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఈ నేపద్యంలో ఉటుకూరు గ్రామములో  వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నెం. 359-P1 లో 60 ఎకరములు ప్రభుత్వ భూమిని మైనింగ్ లీజుకు కొరకు అప్లై చేసుకున్నారన్నారు, ఇంకా ఇ.సి. కుడా పెండింగ్ లో వుందన్నారు. ఈ క్రమంలో అదే సర్వే నెం. 359-P2 లో 50  ఎకరములు ప్రభుత్వ భూమిని దళితులు ఆక్రమించి చదును చేసి వ్యవసాయం చేసుకొనే క్రమంలో మైనింగ్ మాఫియకు సైదాపురం తహశీల్దారు గారు తొత్తుగా మారి ఎలాంటి అనుమతులు లేకుండా వున్న దళితుల ఆక్రమణలో వున్న ప్రభుత్వ భూములను వెంకటకృష్ణ మైనింగు కంపెనీకి అప్పగించడం వల్ల మైనింగ్ మాఫియ పోలీసులు ద్వారా తీవ్రమైన వత్తిడి చేసి దళితులపై అక్రమ కేసులు పెట్టించారన్నారు.  అదే సర్వే నెంబరు గల ప్రభుత్వ భూమిలో  భూస్వాములు, పెత్తందారుల అక్రమంగా 10 ఎకరముల చొప్పున ఆక్రమణ చేసి వ్యవసాయం చేస్తుంటే ఆక్రమణ దారులపైన ఎలాంటి కేసులు గానీ, నిషేద బోర్డులు గానీ పెట్టలేదన్నారు. తక్షణమే జిల్లా కలెక్టరు  స్పందించి మైనింగ్ మాఫియకు తొత్తుగా మారిన సైదాపురం మండల తహశీల్దారు వారి పై చర్యలు తీసుకొని, దళితులపై మైనింగ్  మాఫియ పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని, సర్వే నెం 359 మరియు  356 నందు గల 400 ఎకరముల ప్రభుత్వ భూముల ఆక్రమణలను జిల్లా సర్వేయరు ద్వారా సర్వే చేసి ఆక్రమణలను తొలగించి,  భూస్వాములు, పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ, బంజర, మిగులు, పోరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో భారత కార్మిక సంఘాల సమైఖ్య జిల్లా అధ్యక్షులు కె. రమేష్ , ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి. మమత, ఎ.నాగమణి, ఎం. వెంకరమణమ్మ మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు  నాయకులు ,  పి. కోటయ్య, పి.శ్రీను, ఎ. హరిబాబు, ఆనంద్ తదితరులు  పాల్గొన్నారు.