ప్రజా ప్రతినిధులు అధికారుల మధ్య సమన్వయం అవసరం.
ప్రజా ప్రతినిధులు అధికారుల మధ్య సమన్వయం అవసరం.
రైతులకు యూరియా కొరత రాకుండా చూడండి.
రోడ్ల పై గుంతలు పూడ్చడంలో నాణ్యత ప్రమాణాలు పాటించండి.
ఇళ్ల కేటాయింపులలో గతంలో జరిగిన పొరపాట్లు సరిచేయండి.
బిల్లులు చేసుకొని ఇళ్ళు కట్టని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోండి.
రైతులకు అత్యవసరమైతే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సాగునీటి కాలువలలో పూడిక తీయండి.
విడవలూరు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
విడవలూరు మేజర్ న్యూస్.
పార్టీలు వేరైనా ప్రజలచే ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం పని చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. విడవలూరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని స్థానిక అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వ్యవసాయ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతి రాజ్, రెవెన్యూ, మరియు హౌసింగ్ తదితర శాఖల అధికారులు మండల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పధకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ
సహకార సొసైటీల ద్వారా చేసే యూరియా పంపిణీలో రైతుల పట్ల ఎటువంటి వివక్షచూపవద్దని వ్యవసాయ అధికారులకు సూచించారు. గ్రామాలలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. రోడ్ల పై గుంతలు పూడ్చడంలో జరుగుతున్న జాప్యం పై పంచాయతి రాజ్ మరియు ఆర్ అండ్ బి అధికారులను ప్రశ్నించారు. సకాలంలో రోడ్ల ప్యాచ్ వర్కులు పూర్తి చేసి సంక్రాంతి లోపు రోడ్ల పై గుంతలు పూడ్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. మండల పరిధిలో రోడ్ల నిర్మాణానికి 24 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపి వున్నామని నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ప్రజల అవసరాలను గుర్తించి పని చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గత ఐదేళ్లలో స్తంభించిన గ్రామాభివృద్ధి ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందన్నారు. 15 వ ఆర్ధిక సంఘ నిధులతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలతో గ్రామాలు అభివృద్ధి పనులు జరుతున్నాయన్నారు. భూ ఆక్రమణల ఫిర్యాదులను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించాలని మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పక్కా గృహాల కేటాయింపులో గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్ది అర్హులైన పేదలకు ఇళ్ళు మంజూరు చేయాలని కోరారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండానే బిల్లులు చేసుకున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని హోసింగ్ అధికారులను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆదేశించారు. రైతులకు అత్యవసరం అయితే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సాగునీటి కాలువలలో పూడిక తీయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. అనంతరం వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలకు సకాలంలో సేవలు అందివ్వని అధికారులను తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి ఆవుల శ్రీనివాసులు, ఎంపిడిఓ నగేష్ కుమారి, తహసీల్దార్ చంద్రశేఖర్ తో పాటు మండల పరిధిలోని ఎంపిపిలు, సర్పంచ్లు మరియు అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ కు ఘన నివాళి
విడవలూరు మండల టిడిపి అధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు నివాస గృహం వద్ద ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల టిడిపి అధ్యక్షుడు చెముకుల శ్రీనివాసుల ఇంట్లో స్థానిక నాయకులతో మహిళలతో సమీక్ష నిర్వహించారు.