పోషకాహార పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం

 



నెల్లూరు [వింజమూరు కలిగిరి], రవికిరణాలు ఏప్రిల్ 22 : 

కలిగిరి మండలం బట్టు వారి పాలెం గ్రామంలో నీ అంగన్వాడీ కేంద్ర పరిధిలో పోషకాహార పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా పోషణ్ పక్వాడ్ ముగింపు కార్యక్రమాన్ని జరిపించారు ఈ కార్యక్రమము స్థానిక అంగన్వాడీ కార్యకర్త వి పద్మ బి నాగేశ్వరి ఆధ్వర్యంలో జరిగిందిఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారుల మాడ్యూల్లో కుటుంబాల నమోదు చేసుకోవడానికి మార్గ నిర్దేశం చేయడానికి ప్రత్యేక గృహ సందర్శనాలు విహెచ్ఎస్ ఎన్ డి సమయంలో లబ్ధిదారులనమోదు కార్యక్రమాలు ఏ డబ్ల్యు డబ్ల్యు అండ్ ఏ ఎస్ హెచ్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు సహాయం చేయుట వంటి కార్యక్రమాలను అంగన్వాడీ కేంద్రం నందు స్థానిక లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరిగింది మరియు ఏడవ పోషకాహార పక్షోత్సవంలో నిర్దేశించిన నాలుగు అంశాల గురించి అవగాహన కల్పించడం జరిగింది అన్నారు నాలుగు అంశాలు.వెయ్యి రోజుల సంరక్షణ. 

పోషణ ట్రాకర్ లో స్వయంగా లబ్ధిదారులు నమోదు చేసుకోవడం. పోషక పోషకాహార లోపాలకు గురైన పిల్లల ప్రత్యేక సంరక్షణ ఆరోగ్యవంతమైన జీవనశైలి కల్పించేందుకు కార్యకర్తలు కృషి చేయాల్సి ఉందనిఅన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి పరిధిలోని తల్లులు గర్భవతులు బాలింతలు ఉన్నారు.