కామాక్షితాయి పరకామణి లెక్కింపు






నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్

నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ జొన్నవాడ కామాక్షితాయి దేవస్థానము నందు సోమవారం హుండీలు లెక్కింపు కార్యక్రమం దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సమక్షంలో హుండీలు తెరిచి భక్తులు శ్రీవార్లకు సమర్పించిన కానుకలను లెక్కించారు. అక్టోబర్ 29 తేది నుండి జనవరి 4,2025 వరకు 68 రోజులకు గాను శ్రీ వార్ల ప్రధాన ఆలయ హుండీలు ద్వారా ఆదాయం రూ. 33,24,667/- అన్నదానం హుండీలకు రూ. 2,30,057/- భక్తులు శ్రీవార్ల హుండీ ద్వారా సమర్పించారు అని, బంగారు వస్తువులు 67 గ్రాములు, వెండి వస్తువులు 190 గ్రాములు, అమెరికా డాలర్లు 41 సమర్పించారు అని ఈ కార్యక్రమములో శ్రీ ఆర్ కృష్ణ చైతన్య , ఇన్స్పెక్టర్ దేవదాయ శాఖ, కోవూరు, శ్రీ ఎన్ శ్రీధర్ నాయుడు గారు, కార్యనిర్వహణాధికారి, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, పూడిపర్తి గ్రామం  దేవస్థాన సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి సమక్షంలో శ్రీ ఆర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి తెలిపినారు,ఈ లెక్కింపులో స్థానిక ఏపీజీ బ్యాంక్ అధికారులు, ఆలయ సిబ్బంది మరియు శ్రీ విద్యాసాగర్ కృష్ణ అధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు, రెవిన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు అని కార్యనిర్వహణాధికారి తెలిపినారు.