అసైన్మెంట్ భూములను కొనడం అమ్మడం నేరం..!

మునుముందు రెవెన్యూ సమస్యలు పరిష్కారం..!

నియోజకవర్గ వ్యాప్తంగా 700 రెవిన్యూ సమస్యలు..!

శ్రీ రామాలయం స్లాబ్ పనుల పరిశీలనలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!




మేజర్ న్యూస్  కలిగిరి 

అసైన్మెంట్ భూములను కొనడం అమ్మడం నేరమని, నియోజకవర్గ వ్యాప్తంగా 700 రెవిన్యూ సమస్యలు, నా దృష్టికి వచ్చాయని మునుమందు వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు.

గురువారం వింజమూరు మండలం  శంకవరం గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటాద్రిపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రామాలయం స్లాబు నిర్మాణానికి ఎమ్మెల్యే  కాకర్ల సురేష్ కొబ్బరికాయ కొట్టి పనిని ప్రారంభించారు. అనంతరం స్లాబ్ పనులను పరిశీలించారు.బీసీలు నిర్మించుకుంటున్న ఈ రామాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి సుమారు పది లక్షల రూపాయలు ఎండోమెంట్ ద్వారా నిధులు వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఎండోమెంట్ వారి పర్యవేక్షణలో, వారి కొలతల ప్రకారం నిర్మాణం జరుపుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఘనంగా సన్మానించారు. గ్రామస్తులు మాట్లాడుతూ కొంతమంది ప్రభుత్వ భూములను, పట్టాలు పొంది అమ్ముకుంటున్నారని, మా పొలాలను కూడా వారు అమ్ముకున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసైన్మెంట్ భూములు మరియు ప్రభుత్వ భూములను అమ్మడం కొనడం నేరమని, అటువంటివి జరిగి ఉంటే సహించేది లేదన్నారు. చట్టపరమైన చర్యలకు సిఫారసు చేస్తానని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 700 రెవిన్యూ సమస్యలు నా దృష్టికి వచ్చాయని మునుముందు వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని, మన నియోజకవర్గంలో కూడా రెండు మూడు నెలల కాల వ్యవధిలో పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. యువకులు మహిళలు ఉద్యోగాలు చేస్తేనే కుటుంబాలు బాగుంటాయని, తద్వారా రాష్ట్రం బాగుపడుతుందన్నారు. మునుపెన్నడు లేని విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 150 చెరువులలో వర్షపు నీరు చేరిందని, మెట్ట ప్రాంతానికి ఇది ఒక శుభ పరిణామం అని తెలిపారు. కనుక నాయకులు అధికారులు సమిష్టిగా కృషిచేసి సమస్యలు పరిష్కరించుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చారు.  విశ్రాంతి డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కే మాశిలామణి మాట్లాడుతూ పాలకుడు కాకుండా సేవకుడు మన ప్రాంతానికి వచ్చాడని, ఇది మన అదృష్టం అన్నారు, ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఎమ్మెల్యే కాకమునుపే తమ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసిన సేవా తత్వరుడు అన్నారు. కనుక మన సమస్యలను నేరుగా ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంకినపల్లి ఓబుల్ రెడ్డి శంఖవరం మరియు వెంకటాద్రిపాలెం నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.