మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన బీజేపీ నేత డాక్టర్ మహేంద్ర యాదవ్ 




 నెల్లూరు సిటీ మేజర్ న్యూస్ 

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సోమవారం నెల్లూరు లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ని బీజేపీ జిల్లా యువనాయకులు డాక్టర్ మహేంద్ర యాదవ్ ఆర్& బి గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం తో స్వాగతం పలికారు.. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటం చాలా సంతోషదాయకం అని డాక్టర్ గారు అన్నారు..భవిష్యత్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారి లాంటి అనుభవం ఉన్న నేతల కృషి తో బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ లో బలపడబోతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు..