ప్రత్యామ్నయ పంటలపై భూసార పరీక్షల మీద రైతులకు అవగాహన సదస్సు
ప్రత్యామ్నయ పంటలపై భూసార పరీక్షల మీద రైతులకు అవగాహన సదస్సు
నెల్లూరు [సైదాపురం], రవికిరణాలు ఏప్రిల్ 23 :
సైదాపురం మండలంలోని లింగసముద్రం, మరియు అనంత మడుగు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులకుప్రత్యామ్నాయ పంటలమీద భూసార పరీక్షలు మీద రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. అయితే వరి వేసిన తర్వాత అక్కడ ఉన్న తేమతో సమ్మర్ పల్సస్ పంటలు రైతులు వేసుకోవచ్చు అని జొన్న , నువ్వులు, వంటి ప్రత్యామ్నాయ పంటలు కూడా రైతులు వేసుకున్నట్లయితే పొలాలను ఖాళీగా ఉంచకుండా వ్యవసాయం చేయవచ్చని రైతులకు తెలియజేయడం జరిగింది. అలాగె ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసుకోవాలి అని రైతులకు భూమిపై ప్రత్యామ్నాయ పంటల పైన రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి హైమావతి తెలిపారు