ఎస్సీ,ఎస్టీ మత్స్యకారులను అడ్డగిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన మాజీ డివిఎంసి కమిటీ సభ్యులు
ఎస్సీ,ఎస్టీ మత్స్యకారులను అడ్డగిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన మాజీ డివిఎంసి కమిటీ సభ్యులు
జిల్లాలో వరప్రసాది ఐన సోమశిల ప్రాజెక్టు, జలాశయంలో ఉన్న మత్స్య సంపద లైసెన్స్ అనుమతులు లేని బడ అగ్రకులాల అక్రమదారులు ఎస్సీ,ఎస్టీ మత్స్యకారులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం,తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ గారిని కలిసి వినతి పత్రం అందజేసిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు కొప్పాల రఘు, శేషం సుదర్శన్.
ఈ మేరకు కొప్పాల రఘు మాట్లాడుతూ సోమశిల జలాశయం నుంచి దక్షిణ కాలవ కండిలేరు తెలుగు గంగకు నీటి ప్రవాహాన్ని అధికారులు నిలిపివేయడంతో కలువాయి మండలం, సీతారాంపల్లె ఊరికి దగ్గరలో ఉండే లింగంగుంట కాలువ వద్ద లింగంగుంట కాలవలో భారీగా మత్స్య సంపద నిలుస్తుంది. గతంలో కూడా కోట్లాది రూపాయల మత్స్య సంపదను స్థానిక జలాశయంలో అధికారులచే లైసెన్స్ లు కలిగిన వారిని రానీయకుండా బెదిరింపులకు పాల్పడి దళితులను అడ్డగించారు.
ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే విధంగా ఎస్సీ,ఎస్టీ మత్స్కార్లను రానీయకుండా స్థానిక బడా అగ్రకులాల పెత్తందారులు అక్కడి నాయకుల సపోర్టుతో అడ్డగిస్తున్నారని వారిపై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
ఈ విషయమై స్పందించిన జిల్లా కలెక్టర్ గారు ఎస్సీ, ఎస్టీల మత్స్యకారులకు ప్రాధాన్యత కల్పించాలని లైసెన్సులు కలిగిన వారికి మాత్రమే అవకాశాలు ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ను ఆదేశించడం జరిగింది. వారి వెంట కలువాయి, సోమశిల మత్స్యకారులు పాల్గొన్నారు