అద్భుత విజయాన్ని సాధించిన ఈస్ట్ వుడ్స్ ఇంగ్లీష్ పాఠశాల విద్యార్థులు
నెల్లూరు [వింజమూరు], రవికిరణాలు ఏప్రిల్ 23 :
వింజమూరు పంచాయతీ పరిధిలోని బొమ్మరాజు చెరువు గ్రామ సమీపంలో ఉన్న ఈస్ట్ వుడ్స్ ఇంగ్లీష్ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో అద్భుత విజయాన్ని సాధించింది పాఠశాలలో విద్యను అభ్యసించిన చిన్నారులు చే రెడ్డి తనూజ 600 మార్కులకు 590 మార్కులు సాధించి అద్భుత ప్రతిభను చాటింది అదేవిధంగా ఓం శాంత్ రామ్ 600 మార్కులకు 587 మార్కులు సాధించి తన ప్రతిభను చాటారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పి మధుబాబు వైస్ ప్రిన్సిపాల్ డిపి ప్రసాద్ లు ఈ విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు మొదటి నుండి అకుంఠిత దీక్షతో పట్టుదల ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివారని అందుచేతనే ఈ విజయం సాధ్యమైంది అన్నారు అలాగే భవిష్యత్తులో ఇదే విధమైన కృషిని చేసి ఉన్నత చదువులు చదివి ఉత్తమ స్థానాలలో నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం వై కోటిరెడ్డి డి శ్రీనివాసులు పి ప్రతాప్ అనిత పి శ్రీనివాసులు ఏ జయరామిరెడ్డి విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు.
Post a Comment