సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసరించాలి. డివిఎంసి మాజీ సభ్యులు
ఉదయగిరి: జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఎస్సీ జనాభా ఎక్కువ శాతం ఉండడం విశేషమని వారిని దృష్టిలో ఉంచుకొని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ హాస్టల్స్ 12 ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితులలో 4 ఎస్సి హాస్టల్స్ మూత బడ్డ వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ ఉదయగిరి డివిజన్ ఏ.ఎస్.డబ్ల్యూ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు కొప్పాల రఘు, శేషం సుదర్శన్.
ఈ మేరకు కొప్పాల రఘు మాట్లాడుతూ ఉదయగిరి డివిజన్ పరిధిలో సాంఘిక సంక్షేమ ఎస్సి వసతి గృహాలు 12 ఉండగా ప్రస్తుతం నాలుగు వసతి గృహాలు మూతపడ్డాయి. ఉదయగిరి ప్రాంతం అంటేనే మెట్ట ప్రాంతంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న ఎస్సీ ప్రజలు అనేక రాష్ట్రాలకు వలస వెళ్లి వారి పిల్లలను కూడా ఉన్నతమైన విద్యావంతులుగా తీర్చి దిద్దడంలో ప్రభుత్వం వారు చొరవ తీసుకొని వసతి గృహాలను పెంచి మెరుగైన సౌకర్యాలు కల్పించి ఎస్సీ, ఇతర పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఉదయగిరి తాసిల్దార్ శ్రీమతి సుభద్ర వారిని కలిసి మండల పరిధిలో ఎస్సీ, ఎస్టీ వాడలో పౌర హక్కుల దినోత్సవం గ్రామసభలు ఏర్పాటు చేయాలని శేషం సుదర్శన్ తెలిపారు.
Post a Comment