అనధికార లేవుట్స్ విషయంలో తగ్గేదేలే - నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి..

అనధికార లేవుట్స్ విషయంలో తగ్గేదేలే -  నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి..




మంత్రి నారాయణ విమర్శించే స్థాయి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి లేదు..

ఆకాశం మీద ఉమ్మేస్తే.. తిరిగి వారి ముఖం మీద పడుతుందనే విషయాన్ని చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి..

ప్రభుత్వ స్థలాలలో లేఔట్స్ వేసి నిరుపేదలకు తక్కువకే ప్లాట్లు ఇస్తాం..

అన్ని వసతులతో కూడిన ఎంఐజి లేఔట్లను డెవలప్ చేసి  అందజేస్తాం..

ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి.. లేఔట్స్ వేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాం..

అనధికార లేఔట్స్ వెయ్యాలంటేనే భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటున్నాం

గత ప్రభుత్వంలో YCP నేతల సహకారంతో ఇబ్బడి ముబ్బడిగా అనధికార లేఔట్స్ ను వేశారు..

అనధికార లేఔట్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. ఇప్పటికే అనధికార లేఔట్లను గుర్తించి.. చర్యలకు ఆదేశించినట్లు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు.. 8 నియోజకవర్గాల్లోని 38 మండలాలలో  265 అనధికార లేఔట్స్ను గుర్తించామని  ఆయన స్పష్టం చేశారు.. వాటిని డెమోలిష్ చేసేందుకు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ బృందాలను  ఏర్పాటు చేశామని వెల్లడించారు.. గత ప్రభుత్వంలో వైసిపి చోటా మోటా నేతల సహకారంతో ఇబ్బడి ముబ్బడిగా లేవుట్లను  ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మంత్రి నారాయణ సూచనల మేరకు.. వాటిపై ఉక్కు పాదం మోపుతున్నట్లు వెల్లడించారు.. ఆటోనగర్లోని నుడా కార్యాలయంలో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు.. నుడా అనుమతులు లేకుండా అనధికారంగా లేఔట్ లు వేయాలంటేనే భయపడేలా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.. రాష్ట్రంలోనే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని బెస్ట్ గా తీర్చిదిద్దేందుకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు.. నుడాకు ఆర్థిక వనరులు సమకూర్చడంతో పాటు.. ప్రజలకు అన్ని అనుమతులతో కూడిన ఫ్లాట్లు  ఉండేలా చూస్తున్నామన్నారు..  నుడాలో అనుభవజ్ఞులైన  సీనియర్ అధికారులు ఉన్నారని.. వారి సహకారంతో మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నట్లు కోటంరెడ్డి అన్నారు.. ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఔట్లు వేసిన వారిపై కఠిన చర్యలతో పాటు.. భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు.. నుడా అనుమతులను సులభతరం చేశామని.. ఎవరు అనధికారికంగా లేఔట్లు వెయ్యొద్దన్నారు.. 

 ఎమ్మెల్సీ పర్వత రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్..

మంత్రి పొంగూరు నారాయణ పై రెడ్ క్రాస్ చైర్మన్ గా ఎమ్మెల్సీగా ఉన్న పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.. ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి వారి ముఖానే పడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.. నెల్లూరు నగరాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి నారాయణ పై విమర్శలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రెడ్ క్రాస్ లో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని కోటంరెడ్డి మీడియాకు తెలిపారు.. పర్వత్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నారని విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.. ఆయన నోరు అదుపులో పెట్టుకోకపోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు..  ఎం ఐ జి లేఔట్స్ అభివృద్ధి.. 

ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని దాన్ని పూర్తిగా డెవలప్ చేసి ఎంఐజి లేఔట్స్ రూపంలో నిరుపేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఫ్లాట్లు విక్రయించేందుకు శ్రీకారం చుడుతున్నట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు.. గత ప్రభుత్వంలో ఎంఐజి లేఅవుట్ లో మౌలిక వసతులు కల్పించకపోవడంతో.. ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని అన్నారు.. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిచేసి.. మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ హిమబిందు, నుడా అధికారులు పాల్గొన్నారు 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget