అయ్యప్ప స్వామికి చక్రస్నానం
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
నెల్లూరు వేదాయపాలెం లోని స్వామి అయ్యప్ప దేవస్థానంలో జరుగుతున్న మండల పూజ మహోత్సవంలో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి ఆరాట్టు చక్రస్నానం మహోత్సవం వైభవంగా జరిగినది.ఆలయ కమిటీ అధ్యక్షులు గూడల శేషగిరిరావు, కార్యదర్శి కత్తుల వెంకటరత్నం, కోశాధికారి గడ్డం రత్నయ్య ల నేతృత్వంలో జరిగిన ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఆలయ అర్చకులు హరీ నంబూద్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ద్వజా అవరోహణ మహోత్సవం వైభవముగా జరిగినది. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Post a Comment