సర్వాయపాలెం లో రెవెన్యూ సదస్సులో పాల్గొని అర్జీలు స్వీకరిస్తున్న తహసిల్దార్ పి. శ్రావణ్ కుమార్.
కావలి మేజర్ న్యూస్ :
కావలి రూరల్ మండలం పరిధిలోని సర్వాయపాలెం పంచాయతీలో శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పా ల వెంకట్రావు, గుడిపల్లి నారయ్య, ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్వో పి. శ్రావణ్ కుమార్ హాజరై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ ఆరోవ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు జరుగు గ్రామ సభల సందర్భంగా సర్వాయపాలెం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగిందని, ఈ సదస్సులో 17 అర్జీలు వచ్చినట్లు ఎమ్మార్వో పి. శ్రావణ్ కుమార్ తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించి వారికి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, ఎమ్మార్వో తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలని వాటిని పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అందిన దరఖాస్తులను పరిశీలించి వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో వివరించారు.ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ,విఆర్ఓ హరీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు బ్రహ్మయ్య, పొట్టయ్య, వెంకట రమణయ్య,తదితరులు పాల్గొన్నారు.
Post a Comment