మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు దోహదపడండి అదనపు కమిషనర్ నందన్
నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్)
వ్యాపార వాణిజ్య రంగాల ద్వారా ఆర్థిక స్వయం ప్రతిపత్తిని సాధించి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మెప్మా రిసోర్స్ పర్సన్ (ఆర్.పి) సిబ్బంది దోహదపడాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ సూచించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలుపై రెండు బృందాలకు శిక్షణ తరగతులను శనివారం కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నిర్వహించారు. శిక్షణా తరగతుల్లో అదనపు కమిషనర్ నందన్ పాల్గొని సిబ్బందికి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
మెప్మా వంద రోజుల కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు, అన్ని విషయాలను అవగాహన చేసుకుని ప్రగతి సాధించాలన్నారు. అదేవిధంగా మెప్మా ద్వారా మహిళాల జీవన ఉపాధి మెరుగుపరచి మహిళా పారిశ్రామిక వేత్తలుగా మార్చడమే ధ్యేయంగా ఆర్పీలు పనిచేయాలని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ. రాధమ్మ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో టి.పి.ఆర్.ఓ.బాలకృష్ణ టీ.ఈ. లు అంకయ్య, సుధాకర్, కాంతయ్య, సి.ఏం.ఏం.లు కవిత, జరీనా, సి.ఓ. లు, రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.
Post a Comment