హెల్మెట తప్పక ధరించాలి డి.ఎస్.పి పి. శ్రీధర్.
కావలి మేజర్ న్యూస్:
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కావలి డి.ఎస్.పి
పి. శ్రీధర్ తెలిపారు. శనివారం హెల్మెట్ వినియోగం పై అవగాహన కల్పిస్తూ డి.ఎస్.పి ఆధ్వర్యంలో డి.ఎస్.పి కార్యాలయం నుండి బృందావనం కాలనీ వరకు బైక్లు ర్యాలీగా వెళ్లి తిరిగి డి.ఎస్.పి కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డి.ఎస్.పి. పి. శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెంటు ధరించడం వల్ల ప్రయాణ సమయంలో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాపాయం నుండి బయట పడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ ఎండి ఫిరోజ్ ,టూ టౌన్ సిఐ గిరిబాబు, ఎస్ఐలు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Post a Comment