నూతన వంగడంతో అధిక దిగుబడులు.
విడవలూరు మేజర్ న్యూస్.
వేరుశెనగ పంటలు వచ్చిన నూతన వంగడం అయిన టి సి జి ఎస్- 1694 తో రైతులకు మేలు జరుగుతుందని కోరి వ్యవసాయ శాఖ ఏడి సుజాత తెలిపారు. మండలంలోని రామతీర్థం లో నూతన వేరుశనగ వంగడంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ వేరుశనగ వగడం ద్వారా అధిక దిగుబడును సాధించడంతోపాటు పంటలు వచ్చే చీర పీడల నుంచి కూడా తట్టుకోగలదని తెలిపారు. అలాగే దీని పంట కాల పరిమితి 100 రోజుల నుంచి 105 రోజులు మాత్రమే ఉంటుందని దీని ద్వారా రైతులకు మేలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై రైతులకు పూర్తి అవగాహన కల్పించేందుకే ఈ సమావేశాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ప్రసన్న రాజేష్, మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణయ్య, విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.
Post a Comment