రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
జలదంకి, మేజర్ న్యూస్ :-
రెవెన్యూ కు సంబంధించిన సమస్యలు త్వరతగతిన పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నామని జలదంకి తాసిల్దార్ ప్రమీల అన్నారు. జలదంకి మండలంలోని కేశవరం పంచాయతీలో శనివారం రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ ప్రమీల మాట్లాడుతూ రైతుల భూ హక్కులను పొందేందుకు, ఆన్లైన్ అడంగల్ లాంటివి పొరపాట్లు తావు లేకుండా వారి భూములను వారికే చెందాలనే ఉద్దేశంతో నే రెవిన్యూ సదస్సులు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఎన్నో సంవత్సరాలుగాపరిష్కారం కానీ భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతామని తెలిపారు. పట్టాదారులకు చెందిన భూములు అంశంలో ఎలాంటి పెండింగులు, ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతోనే గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కేశవరం పంచాయతీలో జరిగిన రెవిన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను పరిశీలించారు.అనంతరం భూ సమస్యలపై అధిక సంఖ్యలో అర్జీలు అందాయన్నారు. వీటి పైన సమగ్ర విచారణ జరిపి సత్వర పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలోకార్యక్రమంలో ఎండోమెంట్ అధికారి శాంతయ్య,ఆర్ ఐ శ్రీజ, మండల సర్వేర్ శోభన్ బాబు, శ్యాంసన్,సర్పంచ్ రావి ప్రసాద్ నాయుడు, నాయకులు తల్లపనేని మధుసూదన్ నాయుడు,కంచర్ల వినోద్ నాయుడు, వీఆర్వో గ్రామస్తులు పాల్గొన్నారు.
Post a Comment