మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కార్పొరేషన్ ఘన నివాళి
మాజీ ప్రధాని, పద్మ విభూషణ్ మన్మోహన్ సింగ్ మృతికి నెల్లూరు నగర పాలక సంస్థ ఘనంగా నివాళులర్పించింది. మేయర్ స్రవంతి, కమిషనర్ సూర్య తేజ లు శనివారం కార్పొరేషన్ ప్రాంగణంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
నిజాయితీపరునిగా, నిరాడంబరునిగా, ఆర్థిక వేత్తగా సంక్షోభంలో భారతదేశాన్ని అభివృద్ది పదంలో తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ అని వారు కొనియాడారు.
ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా అగ్ర స్థానంలో నిలబడేందుకు ప్రధాన కారకుడు మన్మోహన్ సింగ్ అని, పేదల ఆకలిని తీర్చేందుకు ఎస్ఆర్ఎసిఎస్ పథకం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఎస్.ఈ.జెడ్, ఆధార్, మహిళలకు ఆస్తి హక్కు చట్టం లాంటి అనేక పథకాలను తీసుకొని వచ్చిన ఆదర్శనీయుడు మన్మోహన్ సింగ్ అని ప్రశంసించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, డి.సి.పి పద్మజ, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
Post a Comment