సిపిఎం మహాసభలు జయప్రదం చేయండి
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
ఫిబ్రవరి 2025 1,2,3 తేదీలలో నెల్లూరులో జరగబోతున్న సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27 వ మహాసభలను ప్రజలందరూ భాగస్వాములై జయప్రదం చేయాలని సిపిఎం నెల్లూరు నగర కమిటీ విజ్ఞప్తి చేసింది.దీనిలో భాగంగా శనివారం ఉదయం నెల్లూరు సిటీ స్థానిక ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో సిపిఎం నెల్లూరు నగర నాయకత్వం మరియు కార్మికులు, సభ్యులు విస్తృతంగా కరపత్రాల పంపిణీ చేశారు.కార్మికులు చిరు వ్యాపారాల వద్ద మహాసభలు జయప్రదం చేయుటకే విరాళాలు సేకరించారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే సిపిఎం మహాసభలను జయప్రదం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారిని అర్ధించారు.ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు,నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి. నాగేశ్వరరావు, షేక్.మస్తాన్ బి,ఆటో కార్మిక సంఘం నగర కార్యదర్శి మురళి మాట్లాడాతూ ఉద్యమాల పురిటిగడ్డ సింహపురిపై సిపిఎం రాష్ట్ర 27వ మహాసభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో సిపిఎం చేపట్టబోతున్న ప్రజా ఉద్యమాలు, పోరాటాలకు సింహపురి గడ్డపై నుండి రూపకల్పన సిపిఎం చేయబోతున్నదని అన్నారు. మహిళలపై జరుగు అత్యాచారాలు అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నదని అన్నారు. దళితులు గిరిజనులు మైనారిటీలు అండగా సిపిఎం నిలిచినదని అన్నారు. రాబోయే కాలంలో మరింత ప్రజా ఉద్యమాలను పోరాటాలను ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా మహాసభలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ మహాసభలలో భాగస్వాములై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Post a Comment