పార్క్ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు అభివృద్ధిలో నెల్లూరు రూరల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో పార్కు స్థలాలు ఎవరు ఆక్రమించిన కఠిన చర్యలు తప్పవని తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి హెచ్చరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ ముత్యాల పాలెంలో సుమారు 50 లక్షలు రూపాయల వ్యయంతో పార్క్ తో పాటు, జగన్ కళాశాల రహదారి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతర పర్యవేక్షణలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ పార్కు స్థలాలు అన్యాకాంతమైన తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణ విషయం ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో పార్కులను సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమాల 19వ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతి ప్రియ, మదన్ కుమార్ రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, కాయల మధు, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment