నూతన నిర్మాణాల పరిశీలనకు వచ్చిన దేవాదాయ శాఖ డిప్యూటీ ఇంజనీర్
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
నెల్లూరు దర్గామిట్టలో వేంచేసియున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నూతన ధ్వజస్తంభము ఏర్పాట్లు,నవగ్రహ మండపం మార్చుట మరియు అన్నదాన భవన నిర్మాణ ఏర్పాట్లు విషయమై శనివారం నాడు శ్రీ సి.హెచ్ శ్రీనివాసరావు డిప్యూటీ ఇంజనీర్ దేవాదాయ శాఖ గుంటూరు వారు దేవస్థానమునకు వచ్చి నవగ్రహ మండపము, అన్నదాన భవనమును మరియు నూతన ద్వజస్తంభమును పరిశీలించి ప్లానింగ్ మరియు ఎస్టిమేట్స్ వేయడం జరిగినది అని దేవస్థాన ఈవో తెలిపినారు. అనంతరం పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది అని తెలిపారు. ఈ కార్యక్రమములో దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు సహాయ కమిషనర్- కార్య నిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి, పి సురేంద్ర, స్థపతి,శ్రీ ఏ.మురళి అసిస్టెంట్ ఇంజనీర్, ఆలయ ప్రధాన అర్చకులు సి.ఎస్ రఘురామమూర్తి మరియు ఆలయ సిబ్బంది పాల్గొనడం జరిగినది.
Post a Comment